సమంత రెండో పెళ్లిపై సద్నా సింగ్

12
- Advertisement -

టాలీవుడ్ నటి సమంత రెండో వివాహంపై సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారగా, ఆమె స్టైలిస్ట్‌గా పనిచేసిన సద్నా సింగ్ చేసిన వ్యాఖ్యలు భారీ చర్చకు దారితీశాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో సద్నా సింగ్ ఒక స్టోరీ పెట్టుతూ, “బాధితురాలా… విలనా… కానీ చాలా బాగా నటించింది” అని రాసింది. ఈ వ్యాఖ్యను చూసిన వెంటనే నెటిజన్లు ఇది సమంత గురించే అని అనుమానించడం మొదలుపెట్టారు.

స్టోరీ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే సద్నా సింగ్ సమంతను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం మరింత సందేహాలకు తావిచ్చింది. దీంతో ఆమె ఈ వ్యాఖ్యను ఎందుకు చేసింది? ఏ సందర్భంలో చెప్పింది? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో మిన్నంటాయి. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ స్టోరీ సమంత రెండో వివాహం చుట్టూ తిరుగుతుందన్న మాటలే వినిపిస్తున్నాయి.

Also Read:TG:సర్పంచ్ ఎన్నికలు..వరాల జల్లు

ఇక నెటిజన్లు సద్నా సింగ్ స్టోరీలోని “విలన్” అన్న పదంపై ప్రత్యేకంగా రియాక్ట్ అవుతున్నారు. సమంతను విలన్ అనాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ఆమెపై ప్రశ్నలు-విమర్శల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై సద్నా సింగ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఊహాగానాలు మరింత పెరుగుతున్నాయి. సమంత రెండో పెళ్లిపై వస్తున్న రూమర్స్‌కు ఈ స్టోరీ కొత్త మసాలా జోడించిందనే చెప్పాలి.

- Advertisement -