పవన్ కళ్యాణ్ చేసిన ‘తెలంగాణకు దిష్టి’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల గౌరవాన్ని దెబ్బతీయడం మాత్రమే కాక, రాజకీయంగా కూడా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని వారు విమర్శించారు.
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్‌ను గోదావరి జిల్లాల్లో గెలిపించడం వల్లనే అక్కడ దిష్టి పడింది. ఇప్పుడు అదే విధమైన అసంబద్ధ వ్యాఖ్యలు తెలంగాణపై చేస్తున్నారు” అని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ మరింత కఠినంగా స్పందిస్తూ, “ఇలా తెలంగాణను అవమానించే మాటలు మాట్లాడితే పవన్ కళ్యాణ్‌ను రాష్ట్రం నుండి తరిమికొడతాం” అని హెచ్చరించారు.
అదే విధంగా మంత్రి వాకిటి శ్రీహరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, “తిక్క మాటలు మానేయాలి. మైలేజ్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. మైలేజ్ రావాలంటే పనులు చేసి చూపించాలి” అని సూచించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. “అవకాశవాది లాగా అనాలోచిత ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించడం నేర్చుకోవాలి” అని అన్నారు.
Also read:Bihar:స్పీకర్‌గా ప్రేమ్ కుమార్

