బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 84 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఎలిమినేషన్‌గా దివ్య బయటకు వెళ్లింది. ఆదివారం ఎపిసోడ్‌లో ఒక్కొక్కరిని సేఫ్ చేస్తూ చివరికి సుమన్ శెట్టి, దివ్య మాత్రమే మిగలగా, నాగ్ వారిని యాక్టివిటీ ఏరియాకు పిలిచి అగ్నిపర్వతం సెటప్ మధ్య ఎలిమినేషన్‌ను ప్రకటించారు. దివ్య బయటకు రాగానే తనూజ ఆమెను హత్తుకుని ఎమోషనల్ అయ్యింది. భరణి అయితే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందరికీ స్వీట్ తినిపించి హౌస్‌ను విడిచిపెట్టింది దివ్య.
స్టేజ్‌పై నాగార్జున మాట్లాడుతూ, “ఈ వారం నువ్వు ప్రిపేర్‌గా కనిపించావ్” అని అడిగితే, “ఫిజికల్, మెంటల్‌గా డౌన్ అయ్యాను కానీ నా జర్నీ పట్ల నేను హ్యాపీగా ఉన్నాను” అని దివ్య చెప్పింది. తన జర్నీ వీడియోను చూసిన తర్వాత, ప్రతి హౌస్‌మెట్‌పై దివ్య తనదైన రివ్యూ ఇచ్చింది.
హౌస్‌మెట్స్‌పై దివ్య రివ్యూ:కళ్యాణ్ గురించి మాట్లాడుతూ “తను చాలా మంచోడు, ఇండస్ట్రీపై పిచ్చి ఉంది, హీరో అవ్వాలి” అని ఎంకరేజ్ చేసింది.పవన్‌కు “ఇక త్యాగాలు వద్దు, నీ కోసం ఆడు, టాప్–5లో ఉండాలి” అని చెప్పింది.ఇమ్మానుయేల్‌ను “నా కంటే బెటర్ ప్లేయర్” అని పొగిడింది.
సంజనకు “మాట జాగ్రత్త, మిమ్మల్ని తక్కువగా అనుకోకండి” అని సలహా ఇచ్చింది.తనూజ గురించి “ఫైట్‌లు వచ్చినా మన మధ్య ద్వేషం లేదు, ఇంకా బాగా ఆడు” అని చెప్పింది.రీతూకి “ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని గేమ్ ఆడు” అని సూచించింది.భరణిని “మా అన్నయ్య” అంటూ ఎమోషనల్ అయ్యింది.
సుమన్ శెట్టిని “చోటా ప్యాకెట్ బడా థమాకా” అని అభినందించింది. దివ్య వెళ్లేటపుడు భరణి భావోద్వేగానికి లోనై, “ఈ హౌస్ ఒక ఫైటర్‌ని మిస్ అవుతుంది” అని అన్నారు. నాగార్జున ఆశీర్వాదాలు తీసుకుని దివ్య బై చెప్పి బయటకు వెళ్లిపోయింది.

