ధోని–విరాట్ కలిస్తే.. వైరల్ పిక్స్!

5
- Advertisement -

రాంచీలో టీమ్ ఇండియా అభిమానులను ఉత్సాహపరిచే అరుదైన క్షణం చోటుచేసుకుంది. క్రీడాభిమానులు ఎప్పటినుంచో చూడాలనుకున్న ధోని–విరాట్ కలయిక మరోసారి జరిగింది. సౌత్ ఆఫ్రికా సిరీస్ కోసం నగరానికి చేరుకున్న విరాట్ కోహ్లీ, ఎలాంటి హంగామా లేకుండా నేరుగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫార్మ్‌హౌస్‌కి వెళ్లాడు.

అక్కడ ఇద్దరూ గంటలకొద్దీ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ధోని గ్యారేజ్‌లో ఉన్న బైకులు, కార్ల కలెక్షన్‌ చూసి కోహ్లీ మంత్ర ముగ్దుడయ్యాడు. రెయర్ ఎడిషన్ బైక్స్, లగ్జరీ కార్లను ఒకటొక్కటిగా చూసి ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. కోహ్లీ సందర్శన సందర్భంగా ధోని స్వయంగా తన కొత్త బైక్‌ను స్టార్ట్ చేసి చూపించాడని సమాచారం.

ఈ అరుదైన రీయూనియన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇద్దరూ కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. “ధోని–విరాట్ కలిస్తే ఆ కిక్కే వేరప్పా” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గ్రౌండ్‌లో ప్రత్యర్థుల్లా కనిపించే ఈ ఇద్దరూ, బయట మాత్రం బంధం, ప్రేమ, గౌరవంతో కలిసే తీరు అభిమానులకు ప్రత్యేక ఆనందం ఇస్తోంది. రాంచీ ఈ స్నేహసమ్మేళనానికి సాక్ష్యమవ్వడంతో క్రికెట్ ప్రపంచం మొత్తం క్షణాల్లోనే ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.

Also Read:ఈ చిన్న అలవాట్లు..మెరుగైన ఆరోగ్యం!

- Advertisement -