రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్రంగా మారిన హైదరాబాద్‌లోని నియోపోలీస్‌లో మరోసారి భారీ స్థాయి భూముల వేలం జరిగింది. ప్లాట్ నంబర్ 15 మరియు 16 లకు నిర్వహించిన ఈ వేలంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది.
ప్లాట్ నంబర్ 15 వేలంలో ఎకరం ధర రూ.151 కోట్ల 25 లక్షలు పలికింది. ఈ ప్లాట్ మొత్తం 4.03 ఎకరాలు కాగా, దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 609 కోట్ల భారీ ఆదాయం సమకూరింది.
ప్లాట్ నంబర్ 16లో ఎకరం ధర రూ.147 కోట్ల 75 లక్షలు పలికింది. ఈ ప్లాట్ విస్తీర్ణం 5.03 ఎకరాలు. దీని ద్వారా ప్రభుత్వానికి అంచనాలకు మించి రూ. 743 కోట్ల ఆదాయం లభించింది.ఈ రెండు ప్లాట్లకు కలిపి మొత్తంరూ.1,352 కోట్ల 72 లక్షల ఆదాయం సమకూరింది. నియోపోలీస్ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్‌ను ఈ వేలం మరోసారి నిరూపించింది.
Also Read:ఉద్యోగుల్లో ఎముకల బలహీనత..కారణాలివే!

