శ్రీలంకలోని అనేక ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు మరియు కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులు సంభవించాయి.ఈ విపత్తుల కారణంగా మరణించిన వారి సంఖ్య 56కి చేరినట్లు శ్రీలంక ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం (DMC) ప్రకటించింది.
మరో 21 మంది ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం అందింది. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతికి అనేక ప్రాంతాలలో ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి.
Also Read:TTD:డిసెంబర్.. విశేష పర్వదినాలు
రహదారులు దెబ్బతినడంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం సహాయక బృందాలను రంగంలోకి దించింది. తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలకు తక్షణ సహాయక చర్యలు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

