2008లో జరిగిన 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమాలో హీరోగా నటించిన అడివి శేష్, మేజర్ కుటుంబ సభ్యులను కలిశారు.’మేజర్’ సినిమా విడుదలై మూడేళ్లు గడిచిన నేపథ్యంలో, ఆ సినిమా హీరో అయిన అడివి శేష్ మేజర్ తల్లిదండ్రులను ముంబైలో కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
మేజర్ తల్లిదండ్రులతో గడపడం, వారిని పలకరించడం శేష్‌కు ఎంతో ప్రత్యేకమని ఆయన తెలిపారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్మారక చిహ్నం వద్ద అడివి శేష్ నివాళులు అర్పించారు. మేజర్ సందీప్ త్యాగాన్ని స్మరించుకుంటూ, ప్రతి సంవత్సరం నవంబర్ $26$న మేజర్ కుటుంబంతో గడపడం మరియు అమరుడికి నివాళులు అర్పించడం అడివి శేష్‌కు ఒక ఆనవాయితీగా మారింది.
దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడి కథను తెరపై చూపించినందుకు మేజర్ కుటుంబం గతంలో అడివి శేష్‌ను ప్రశంసించింది. ఈ పర్యటన మరోసారి మేజర్ సందీప్ స్ఫూర్తిని గుర్తు చేసింది.
Also Read:TTD:డిసెంబర్.. విశేష పర్వదినాలు

