భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం (నవంబర్ 26, 2025) నాడు పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జరిగింది.
యునెస్కో డైరెక్టర్ జనరల్ ఖలీద్ ఎల్-ఎనానీ సమక్షంలో, భారత రాయబారి మరియు యునెస్కోకు శాశ్వత ప్రతినిధి అయిన విశాల్ శర్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.యునెస్కో వంటి అంతర్జాతీయ వేదికపై డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ అంబేద్కర్ బోధనలు మరియు ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కావడానికి ఈ విగ్రహావిష్కరణ దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
అంబేద్కర్ బోధించిన సమానత్వం, న్యాయం మరియు మానవ హక్కుల ఆదర్శాలు యునెస్కో లక్ష్యాలతో ఏకీభవిస్తాయని భారత రాయబారి విశాల్ శర్మ ఈ సందర్భంగా తెలిపారు. యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహంతో పాటు ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం కూడా నిలవడం భారత్‌కు దక్కిన మరో గౌరవంగా భావిస్తున్నారు.
Also Read:రివాల్వర్ రీటా..పక్కా కమర్షీయల్

