TG:పంచాయతీ ఎన్నికలు..నేటి నుంచి నామినేషన్లు

8
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నేటి నుంచి (నవంబర్ 27) అధికారికంగా ప్రారంభమైంది. మూడు దశల్లో జరగనున్న ఎన్నికల్లో భాగంగా, తొలి విడతకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ నేటి ఉదయం నుంచి ప్రారంభమైంది.

ఈ నామినేషన్ల ప్రక్రియ మూడు రోజుల పాటు కొనసాగనుంది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల పత్రాలను ఈ నెల నవంబర్ 30న అధికారులు పరిశీలించి (స్క్రూటినీ) అభ్యంతరాలుంటే తెలియజేస్తారు.

అభ్యర్థులు తమ నామినేషన్లను డిసెంబర్ 3వ తేదీ వరకు ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.

తొలి విడతలో మొత్తం 4,236 సర్పంచ్ స్థానాలకు మరియు 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న నిర్వహించబడుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరిపి, ఫలితాలను ప్రకటించనున్నారు. స్థానిక ఎన్నికలు కావడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Also Read:రివాల్వర్ రీటా..పక్కా కమర్షీయల్

- Advertisement -