కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పవర్ పాలసీపై BRS ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కంటే అధిక ధరలకు కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తూ రాష్ట్రంలో భారీ కుంభకోణానికి తెరలేపారని ఆయన ఆరోపించారు.
రూ.16,800 కోట్ల కుంభకోణం ఆరోపణ” కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 2026 నాటికి థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని 40% తగ్గిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పాలసీని పట్టించుకోకుండా, కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తామని చెప్తున్నారు అని హరీష్ రావు విమర్శించారు
ధరలను పోల్చుతూ మా BRS ప్రభుత్వం యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ఒక్క మెగావాట్ ఉత్పత్తికి రూ.7 కోట్లు పెట్టి నిర్మించింది. కానీ మీరు (కాంగ్రెస్) రామగుండం పవర్ ప్లాంట్‌ను ఒక్క మెగావాట్‌కు రూ.14 కోట్లు పెట్టి నిర్మిస్తున్నారు అని అన్నారు.
రామగుండం పవర్ ప్లాంట్‌లో రూ. 5,600 కోట్ల కుంభకోణం,పాల్వంచ పవర్ ప్లాంట్‌లో రూ.5,600 కోట్ల కుంభకోణం,మక్తల్ పవర్ ప్లాంట్‌లోరూ. 5,600 కోట్ల కుంభకోణంమొత్తంగా, కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణంలో రూ.16,800 కోట్ల భారీ కుంభకోణానికి తెర లేపారని ఆయన ఆరోపించారు. ఎక్కువ ధరకు కరెంటు కొనుగోలు ఎందుకు?గత BRS ప్రభుత్వం NTPC నుండి తక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేయడానికి ఒప్పందాలు చేసుకుందని హరీష్ రావు గుర్తు చేశారు.
తక్కువ ధరకు NTPC నుండి వస్తున్న కరెంటును వదిలి, రూ.50 వేల కోట్లతో రామగుండం పవర్ ప్లాంట్ కట్టి, అక్కడ యూనిట్‌కు రూ.10 చొప్పున తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోంది. తక్కువ ధరకు వచ్చే కరెంటును వద్దని, అప్పు చేసి మరీ ఎక్కువ ధరకు కొనడంలో మతలబ్ ఏంటి?” అని హరీష్ రావు ప్రశ్నించారు.
Also Read:టీటీడీకి రూ. 9 కోట్ల భారీ విరాళం

