రెండో టెస్టులో భారత్‌ ఘోర పరాజయం

6
- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమితో టెస్ట్ సిరీస్‌ కొల్పోయింది టీమిండియా.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేయగా, భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 201 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికాకు భారీ 288 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసి, భారత్ ముందు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ భారీ ఛేదనలో భారత బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయింది.

ఫలితంగా, దక్షిణాఫ్రికా ఈ టెస్టు మ్యాచ్‌ను 408 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ విభాగం పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ఈ ఓటమితో టెస్టు సిరీస్‌ను కొల్పోయింది.

Also Read:మోదీ సర్కారుపై కార్మిక సంఘాల నిరసన

- Advertisement -