AP:6 నెలల్లో రాజధాని రైతుల సమస్యకు పరిష్కారం

7
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడానికి త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్,రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ,ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్,సీఆర్డీఏ (CRDA) అధికారులు భేటీ అయ్యారు.

6 నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం అని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో ప్రతి రైతుకు తప్పకుండా న్యాయం చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

రాబోయే 6 నెలల్లో రైతుల సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరిస్తామని … ప్రస్తుతం ప్రతి రోజూ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇంకా కేవలం 719 ఎకరాలకు మాత్రమే ప్లాట్లు కేటాయించాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. స్వార్థం కోసం ఒకరిద్దరు చెప్పే మాటలను ఎవరూ నమ్మవద్దు అని మంత్రి నారాయణ రైతులకు విజ్ఞప్తి చేశారు.

Also Read:CECపై ఫేక్ వీడియో..కేసు నమోదు

- Advertisement -