కార్తీక మాసం..యాదాద్రికి భారీ ఆదాయం

9
- Advertisement -

పవిత్రమైన కార్తీక మాసంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో, ఆలయ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ మాసంలో స్వామివారి దర్శనానికి దాదాపు 20 లక్షల 52 వేల మంది భక్తులు విచ్చేశారు.

భక్తుల రద్దీ పెరగడంతో ఆలయానికి మొత్తం రూ. 17 కోట్ల 62 లక్షల 33 వేల 331 ఆదాయం లభించింది.ఈ గణాంకాలు గత ఏడాదితో పోలిస్తే గణనీయమైన పెరుగుదలను సూచిస్తున్నాయి.

గత ఏడాది కార్తీక మాసంలో ఆదాయం రూ.14 కోట్ల 30 లక్షల 69 వేల 481 కాగా ఈ ఏడాది పెరిగిన అదనపు ఆదాయం రూ.3 కోట్ల 31 లక్షల 63 వేల 850 .గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రూ.3.31 కోట్లకు పైగా అదనపు ఆదాయం రావడం విశేషం. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తర్వాత, కార్తీక మాసంలో భక్తుల సందడి, ఆదాయం పెరగడం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read:’12A రైల్వే కాలనీ’…డిఫరెంట్ జోనర్

- Advertisement -