ఏకంగా జీహెచ్ఎంసీ పార్కును అమ్మేశారు ఓ సబ్ రిజిస్ట్రార్. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు.. రిజిస్ట్రార్లు, ఇతర అధికారులపై అవినీతి ఫిర్యాదులు చూసి, శాఖను భ్రష్టు పట్టిస్తున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఐజీ(రిజిస్ట్రేషన్).
హైదరాబాద్ – వనస్థలిపురంలో సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కడంతో, ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించారు సీనియర్ అసిస్టెంట్ శివశంకర్. బాధ్యతలు స్వీకరించిన మూడు రోజులకే, సమీపంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కును ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారు సదరు అధికారి.
స్థానికుల ద్వారా ఫిర్యాదు అందుకుని, శివశంకర్‌పై వేటు వేశారు ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు. ఒక డాక్యుమెంట్ మీద సంతకం చేసేందుకు రూ.15 లక్షలు లంచం డిమాండ్ చేశారు సరూర్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ శ్రీలత. దీంతో బాధితుడి పిటిషన్ పట్ల విచారణ జరిపి, సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేసింది న్యాయస్థానం. తీవ్ర విమర్శల మధ్య ఉన్నతాధికారులతో సమావేశమై, ఇక నుండి చిన్న ఫిర్యాదు అందినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు.
Also Read:9.2 కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహం

