కాంగ్రెస్ పాలనలో అన్నీ సమస్యలే!

12
- Advertisement -

ఎరువులందవు. విత్తనాలు అందవు. కరెంటు సరిగ్గా రాదు. రైతుబంధు రాదు. రుణమాఫీ జరగదు. బోనస్ ఎగ బెడతావు. పంటల బీమా లేదు. ఇంతే కదా రేవంత్ రెడ్డి పాలన అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్‌ రావు. వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన ఒక్క హామీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందా?… దిగుమతి సుంకాలు ఎత్తివేసి రైతులపై ఆంక్షలు పెట్టడం బీజేపీ పద్ధతి….పత్తి, పామాయిల్ దిగుమతులపై సుంకం ఎత్తేసి ఎవరికి లాభం చేస్తున్నారు? ఎందుకు రైతుల మెడకు ఉరితాడు వేస్తున్నారు? అన్నారు.

బడా కాంట్రాక్టర్లకు, కార్పొరేట్లకు లాభం చేసేందుకు రైతులను అన్యాయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం….దేశంలో మొట్టమొదటిసారి రైతులు ఉన్నా రైతుబంధు తెచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం.రేవంత్ రెడ్డి మేలుకోకపోతే తెల్ల బంగారం పత్తిని తెచ్చి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు పోస్తం.జూబ్లీహిల్స్ ప్యాలస్ ని ముట్టడిస్తాం.
రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం…వరంగల్ వరదల్లో 20,000 ఇండ్లు మునిగిపోయాయి…మునిగిపోయిన ఇళ్లకు 15,000 ఇస్తామన్నారు. రెండు నెలలు అయింది ఒక రూపాయి ఇవ్వలేదు…వెంటనే నష్టపరిహారం విడుదల చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు…రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతున్నది….రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, బీజేపీ తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సీసీఐ తుగ్లక్ వంటి పిచ్చి నిర్ణయాలు తీసుకొని రైతులను ఇబ్బందుల గురి చేస్తున్నది. L1,L2,L3 విధానం, కపాస్ యాప్ లో 8 నుండి 12% తేమ ఉండాలనే తుగ్లక్ నిర్ణయాలతో రైతులకు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. ..రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లులన్నీ రెండు రోజులుగా మూతపడ్డాయి. పత్తి రైతులంతా అయోమయంలో ఉన్నారు అన్నారు.

ఈరోజు రైతులకు పత్తిని అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. 8,100 రూపాయలు పత్తికి మద్దతు ధర కానీ 6,000 రూపాయలకే రైతులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. క్వింటాల్ మీద 2000 రూపాయలను పత్తి రైతుల నష్టపోతున్నారు. మాటల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరచేతిలో వైకుంఠం చూపించి చేతల్లో నరకం చూపిస్తున్నారు. వరదల వల్ల, తుఫాన్ ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతే తుగ్లక్ నిర్ణయాలతో మరింత ఇబ్బంది పెట్టడం సరికాదు. 60 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రికి పత్తి రైతుల గురించి కేంద్రానికి విన్నవించే అవకాశం రాలేదా?,ముఖ్యమంత్రికి పత్తి రైతుల సమస్యలు కేంద్రానికి చెప్పే ఓపిక లేదా? సమయం లేదా?,రేవంత్ రెడ్డికి బడేభాయితో మంచి సంబంధాలే ఉన్నాయి కదా. ఎందుకని పత్తి రైతుల గురించి బడే భాయికి చెప్పడం లేదు. ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచిన రేవంత్ రెడ్డి పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందించలేకపోతున్నారు. ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది. పంట చేనులన్నీ దెబ్బతిన్నాయి. పెట్టిన పెట్టుబడులు రాక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎల్ వన్, ఎల్ టు, ఎల్ త్రీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 8 నుంచి 12 శాతం తేమ విధానాన్ని సవరించండి, కపాస్ యాప్ ని రద్దు చేయండి.
స్మార్ట్ ఫోన్లు లేకపోవడం వల్ల కపాస్ యాప్ లో నమోదు చేయడం రైతులకు కష్టమైన పని. గత సంవత్సరం లాగానే 12 క్వింటాల పత్తి కొనాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచి ఏం చేస్తున్నారు? చెప్పాలన్నారు.

దేశంలో మొట్టమొదటిసారి రైతులు ఉన్నా రైతుబంధు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం.రేవంత్ రెడ్డి మేలుకోకపోతే తెల్ల బంగారం పత్తిని తెచ్చి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు పోస్తం. జూబ్లీహిల్స్ ప్యాలస్ ని ముట్టడిస్తాం. ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కలిసి నిబంధనలు ఎత్తివేసి పత్తికొనే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నా. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. వరంగల్ వరదల్లో 20,000 ఇండ్లు మునిగిపోయాయి. సకాలంలో గేట్లు ఎత్తి ఉంటే వరంగల్ నగరం ముగిపోయేది కాదు. మునిగిపోయిన ఇళ్లకు 15,000 ఇస్తామన్నారు. రెండు నెలలు అయింది ఒక రూపాయి ఇవ్వలేదు. వెంటనే నష్టపరిహారం విడుదల చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Also Read:పత్తి రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?

- Advertisement -