ఆరోజు నేను చేసిన కృషి వల్లే ఈరోజు హైదరాబాద్ ముస్లింలు అందరూ కోటీశ్వరులు అయ్యారు అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ సభలో మరోసారి గొప్పలు చెప్పుకున్నారు చంద్రబాబు.
నాడు హైదరాబాద్ బిర్యానీని కూడా మేమే ప్రమోట్ చేశాం … ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు దక్కేలా చేశాం అన్నారు. వక్స్ బోర్డు చట్టం విషయంలో ముస్లింలకే మద్దతు ఇచ్చినట్లు తెలిపారు చంద్రబాబు.
వక్స్ బోర్డు చట్టంలో కేంద్రం సవరణలు తెచ్చినా.. ఏపీలో మాత్రం మైనార్టీ సోదరులనే పెట్టి వారి ఆస్తులను కాపాడుతాను అన్నారు. ఓల్డ్ సిటీ పక్కనే ఎయిర్ పోర్ట్‌ను నేనే కట్టాను… ఇతర ప్రాంతాల వాళ్లు ఓల్డ్ సిటీ వెళ్లి షాపింగ్ చేసేలా ముత్యాలను నేనే ప్రమోట్ చేశాను… నేను చేసిన అభివృద్ధి వల్లే హైదరాబాద్‌లో ముస్లింలు కోటీశ్వరులు అయ్యారు అన్నారు.
Also Read:ఏపీలో మరో భారీ పెట్టుబడి

