భూ భారతిలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70,000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారు రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చిన భూ భారతి చట్టం, తమ పట్ల శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు, ప్రజలు.
నెలల తరబడి రెవెన్యూ ఆఫీసులు, కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ తిరిగినా, చిన్న సమస్యలు కూడా పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. కరెక్షన్ విభాగంలో తహసీల్దార్ స్థాయిలో 25,601, ఆర్డీవో స్థాయిలో 5946, అదనపు కలెక్టర్ల స్థాయిలో 3650, కలెక్టర్ల లాగిన్లలో 7360 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
నిషేధిత భూములకు సంబంధించిన వివాదాలపై తహసీల్దార్ స్థాయిలో 8569, ఆర్డీవో స్థాయిలో 4001, అదనపు కలెక్టర్లు లాగిన్లో 7411, కలెక్టర్ల లాగిన్లో 4162 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు గుర్తించారు అధికారులు. ఈ విధంగా కరెక్షన్ విభాగంలో 42,567, నిషేధిత భూముల విభాగంలో 24,143 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, చిన్న చిన్న తప్పులు సరిచేసేందుకు కూడా నెలల తరబడి తమను తిప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు బాధితులు. ఇప్పటికైనా ప్రభుత్వం, రెవెన్యూ శాఖ మేలుకుని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే సరిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు బాధిత రైతులు.
Also Read:ప్రజాకవి కాళోజీ..వర్థంతి

