- Advertisement -
రెండ్రోజుల భూటాన్ పర్యటన ముగించుకున్నారు ప్రధాని మోదీ. తిరుగుప్రయాణానికి ముందు భూటాన్ నాలుగో రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌తో సమావేశం అయ్యారు మోదీ.
భూటాన్ రాజుతో కలిసి జల విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభించారు మోదీ. రక్షణ, ఇంధనం, సాంకేతికతపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం..ఈ పర్యటన భారత–భూటాన్ ద్వైపాక్షిక స్నేహాన్ని మరింతగా బలోపేతం చేస్తుంది. రెండు దేశాల మధ్య అనేక రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి దోహదం చేస్తుంది అని తెలిపింది. భారత ప్రభుత్వం, భూటాన్‌లో శక్తి రంగ ప్రాజెక్టుల కోసం ₹4,000 కోట్ల రాయితీ రుణం మంజూరు చేసినట్లు ప్రకటించింది.
Also Read:ఆస్పత్రిలో చేరిన నటుడు గోవిందా
- Advertisement -

