జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నిబంధనలకు విరుద్ధంగా నాన్ లోకల్ కాంగ్రెస్ నేతలు తిష్ట వేసి ఓటర్లను ప్రభావితం చేశారని బీఆర్ఎస్ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది.
ప్రభుత్వ విప్ లు బీర్ల అయిలయ్య, రాంచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లను ప్రలోభ పెట్టిన సాక్ష్యాలను సీ ఈ ఓ కు అందజేసి చర్యలు తీసుకోవాలని కోరింది. సీ ఈ ఓ ను కలిసిన బృందంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ , TSPSC మాజీ సభ్యురాలు సుమిత్ర, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె. కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ మైనారిటీ నేతలు అర్షద్ అలీ ఖాన్, ఆజం అలీ తదితరులు ఉన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ నాయకుల కోడ్ ఉల్లంఘనలపై మాజీ కార్పొరేషన్ చైర్మన్ డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్, మాజీ BC కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, ఉపేంద్ర చారి, పార్టీ నేతలు ఎం.ఎన్. శ్రీనివాస్, బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు జక్కుల లక్ష్మణ్, నిరోష ఈసీకి ఫిర్యాదు చేశారు.
Also Read:కొత్తరకం సాలీడు..ఎక్కడో తెలుసా?

