పరకామణి కేసులో సీఐడీ దర్యాప్తు..

9
- Advertisement -

శ్రీవారి పరకామణి కేసులో సీఐడీ బృందం దర్యాప్తు చేపట్టనుంది. డీఐజీ రవిశంకర్ అయ్యానార్ ఆధ్వర్యంలో సీఐడీ విచారణ చేయనుంది. పరకామణిలో దొంగతనం, నగదు లెక్కింపుతోపాటు రాజీ పరిణామాలపై క్షేత్రస్థాయిలో సీఐడీ అధికారులు చేయనున్నారు.

ఇప్పటికే తిరుమల, తిరుపతిలో పరకామణి కేసుకు సంబంధించి రికార్డులను సీజ్ చేసి హైకోర్టుకు సమర్పించింది సీఐడీ. నాడు లోక్‍అదాలత్‍లో చేసుకున్న రాజీ చెల్లదని హైకోర్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.

హైకోర్టు ఆదేశాలతో పలు బృందాలుగా పరకామణి కేసులో పాత్రధారులు, సూత్రధారులను పట్టుకునే పనిలో సీఐడీ అధికారులు ఉన్నారు.

Also Read:ఎన్నికలు రాగానే ఎన్టీఆర్ గుర్తుకొచ్చారా?

- Advertisement -