హర్యానా నుంచి వచ్చిన ఓటర్ల జాబితా వివరాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, దాదాపు 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి విజయాన్ని “దొంగిలించారని” ఆరోపించారు.
అంతేగాదు హర్యానాలో ఓటు చోరీ జరిగిందని ఆరోపిస్తూ బ్రెజిలియన్ మోడల్ లారిస్సా ఫోటోను చూపించారు రాహుల్. తాజాగా దీనిపై స్పందించారు లారిస్సా. తన పాత ఫొటోను వాడి సీమా, సరస్వతి అంటున్నారని.. తాను ఓ బ్రెజిలియన్ అని, భారతదేశంలో ఎన్నికల ప్రయోజనం కోసం తన ఫోటోను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది లారిస్సా.
తన ఫొటోను భారతదేశంలో ఓటింగ్ కోసం వాడుతున్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయిందని, ఈ వ్యవహారంతో తాను ఎలాంటి సంబంధం లేనని పేర్కొంది.
మిత్రులారా, నేను మీకు ఒక జోక్ చెబుతున్నాను. ఇది ఎంత పిచ్చిదో చూడండి… నా పాత ఫోటోను భారత్‌లో ఓటు వేయడానికి వాడుతున్నారు. ఊహించండి, ఆ ఫోటో నేను 18 లేదా 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తీసినది. ఇప్పుడు అదే ఫోటో భారతీయ ఓటర్‌ది అని చెబుతున్నారు! ఇది ఏ పిచ్చి ప్రపంచం, ఏమి జరుగుతోంది? అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
Also Read:భారత మహిళ జట్టుకు ప్రధాని ప్రశంసలు

