రేవంత్‌పై చర్యలు తీసుకోండి

18
- Advertisement -

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన అత్యంత అసభ్యకరమైన, నిందారోపణాత్మక, వ్యక్తిత్వాన్ని దూషించే వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయం అన్నారు బీఆర్ఎస్ నేతలు.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (Model Code of Conduct) బహిరంగంగా ధిక్కరించి ప్రత్యర్థి నేతలపై వ్యక్తిగతంగా, అవమానకరంగా మాట్లాడడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అన్నారు బీఆర్ఎస్ నేతలు.

ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడమే కాకుండా ఓటర్లలో ద్వేషం, అనుచిత భావోద్వేగాలు రేకెత్తించే విధంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయి. కాబట్టి, ఉప ఎన్నికల శాంతియుత, స్వచ్ఛ, నిష్పాక్షిక నిర్వహణ కోసం రేవంత్ రెడ్డిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, సంబంధిత నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ ఎన్నిక రిటర్నింగ్ అధికారిని కలిసి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పి .శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె .కిషోర్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Also Read:ముస్లింలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి

- Advertisement -