బాహుబలి ది ఎపిక్..వసూళ్లు!

6
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం బాహుబలి. రెండు పార్టులుగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాగా బాహుబలి ది ఎపిక్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ భారీగా రిలీజ్ అయింది.

ఈ సినిమాకు రీ రిలీజ్ లో దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ వస్తాయని అంచనా పెట్టుకున్నారు. ప్రమోషన్స్ ఏమి లేకపోయినా రాజమౌళి స్ట్రేటజీతోనే హైప్ వచ్చి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ బాహుబలి ది ఎపిక్ సినిమా ఇప్పటివరకు 45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఇప్పటివరకు సనమ్ తేరి కసం – 42 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా దానిని అధిగమించింది బాహుబలి. ఆ తర్వాత తుంబాడ్ -38 కోట్లు, ఘిల్లి – 32 కోట్లు, ఏ జవానీ హై దివాని – 26 కోట్లతో రీ రిలీజ్ లలో టాప్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఇంకా థియేటర్స్ లో నడుస్తుంది కాబట్టి రౌండ్ ఫిగర్ 50 కోట్లు గ్రాస్ రావొచ్చని అంచనా అవేస్తున్నారు.

Also Read:KTR:టీ హబ్ దేశానికే ప్రతిబింబం

- Advertisement -