BB9:మాధురి ఎలిమినేట్

11
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు తాజా వారంలో భాగంగా ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు దివ్వెల మాధురి. ఆదివారం ఫన్ డే కావడంతో ఆధ్యంతం ఆసక్తికరంగా ఎపిసోడ్ సాగింది. తన కొత్త సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ప్రమోషన్స్ కోసం రష్మిక, హీరో దీక్షిత్ బిగ్‌బాస్‌లో సందడి చేశారు.

నామినేషన్స్‌లో ఉన్న వారికి ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన నాగ్ చివరికి మాధురి, గౌరవ్ ఇద్దరి కళ్లకి గంతలు కట్టి కారులో ఎక్కించారు. మీ ఇద్దరిలో లీస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్లు ఎలిమినేటర్ అవుతారు.. ఇంకొకరు సేవ్ అయి మారుతి సుజుకీ కారులో లోపలికి వస్తారు అని నాగార్జున చెప్పారు. కాసేపటికి మాధురికి లీస్ట్ ఓటింగ్ వచ్చిందంటూ స్క్రీన్ మీద ఫొటో వచ్చింది. దీంతో బాటమ్ 2లో లీస్ట్ ఓటింగ్ వచ్చింది మాధురి. తనూజ నీ ఎదురుగా నువ్వు గెలుచుకున్న గోల్డెన్ బజర్ ఉంది.. దానికి ఒక సేవింగ్ పవర్ ఉంది.. అది నువ్వు ఈ వారం వాడొచ్చు ఏ వారమైనా వాడొచ్చు.. నీ కోసం వాడుకోవటానికి మాత్రం దానికి పవర్ లేదు అని చెప్పారు. అయితే తాను పవర్‌ను యూజ్ చేయట్లేదని చెప్పగా మాధురి ఎలిమినేట్ అయిందని ప్రకటించారు నాగ్.

మాధురి స్టేజ్ మీదకి రాగానే ఎక్స్‌పెక్ట్ చేశారా.. అని నాగ్ అడిగారు. చేశా సార్ నిజానికి ఎలిమినేట్ అవ్వాలని కోరుకున్నా.. నవంబర్ 4 మా ఆయన బర్త్‌డే సార్.. అని మాధురి చెప్పింది. ఓహో అంటూ నాగ్ నవ్వారు.

Also Read:బస్సు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

- Advertisement -