బీఆర్ఎస్‌కు ఓటెయండి.. ఎన్నారైల విజ్ఞప్తి

7
- Advertisement -

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత  కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని లండన్ లోని ఎన్నారైలు జూబ్లీహిల్స్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల తర్వాత మీ ఇండ్లకు కారు రావాల్నా? బుల్డోజర్ రావాల్నా? జూబ్లీహిల్స్‌ ప్రజలు ఆలోచించుకోవాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని నమ్మి గ్రామాల్లో మోసపోయినట్టుగా, హైదరాబాద్ ప్రజలు మోసపోవద్దని మేము కోరుకుంటున్నామని, ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే ప్రశ్నించే బీఆర్ఎస్ పార్టీకి ఓటెయ్యాలని ఎన్నారై బీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు & ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ పతనం జూబ్లీహిల్స్‌ నుండే మొదలైందని, హైడ్రా తో హైదరాబాద్ బ్రాండ్ ని నాశనం చేశారని, సామాన్య పేద ప్రజలకు ఇల్లు లేకుండా రోడ్డున పడేశారని, ప్రజలంతా ఓటు ద్వారా కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని, ఇచ్చిన గ్యారెంటీలు హామీలు అమలు జరగాలన్నా ప్రశ్నించే గొంతుకు బలం చేకూరాలన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గారి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే మైనారిటీ నాయకుడు అబ్దుల్ జాఫర్ మాట్లాడుతూ…కెసిఆర్ నాయకత్వంలోనే ముస్లిం మైనారిటీలకు న్యాయం జరిగిందని, ఎన్నో ప్రత్యేక పథకాల ద్వారా పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ మైనారిటీల అభివృద్ధికి కృషి చేయడమే కాకుండా రాజకీయంగా కూడా సముచిత స్థానం కలిపించి గౌరవించిన సంగతి జూబ్లీహిల్స్‌ లో మైనారిటీ కుటుంబ సభ్యులు మరిచి పోవద్దని, కాబట్టి రాబోయే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో శ్రీమతి మాగంటి సునీత గారి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ తో గెలిపించి నేడు మనమంతా కెసిఆర్ గారికి కృతజ్ఞత చెప్పుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు అన్ని పార్టీలు మైనారిటీలని ఓటు బ్యాంక్ లా వాడుకున్నారు కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మైనారిటీలని గౌరవించి అభివృద్ధి చేసిందని అబ్దుల్ జాఫర్ తెలిపారు. ఎప్పటికైనా మైనారిటీల అభివృద్ధి కెసిఆర్ గారితోనే సాధ్యమని తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఎన్నారై బీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే అధ్యక్షులు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు హరి నవాపేట్, సత్య మూర్తి చిలుముల,రవి కుమార్ రేటినేని,అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ గణేష్ కుప్పాల, కార్యదర్శులు మల్లా రెడ్డి, సురేష్ గోపతి, అబ్దుల్ జాఫర్, కార్యదర్శి – ఐటీ, మీడియా పీఆర్ రవి ప్రదీప్ పులుసు, సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, కార్యదర్శి – యూత్ వింగ్ ప్రశాంత్ మామిడాల, సోషల్ మీడియా కన్వీనర్ & మెంబర్ షిప్ కోఆర్డినేటర్ అంజన్ రావు, ఈవెంట్స్ ఇంచార్జ్ తరుణ్ లునావత్ మరియు సభ్యులు షేక్ ఇమాం గౌస్, హరి కృష్ణ మామిళ్ళ, మొహ్మద్ అబ్దుల్ ఖుదూస్, దయాల వసంత్ కుమార్ , మహేందర్ పడిగెల, శ్యామ్ రెడ్డి సరికొండ, నాగరాజు, అజయ్ రావు, హర్షవర్ధన్ రెడ్డి, సంతోష్, సాయి కిరణ్ , హనీఫ్, తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Also Read:BB9:కెప్టెన్‌గా దివ్య

- Advertisement -