యుకేకు చంద్రబాబు దంపతులు

4
- Advertisement -

వ్యక్తిగత పర్యటనలో భాగంగా UK వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు దంపతులు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్టింగ్విష్ట్ ఫెలోషిప్ అవార్డుకు ఎంపికయ్యారు భువనేశ్వరి. ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్‌లో హెరిటేజ్ ఫుడ్స్ గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకోనున్నారు నారా భువనేశ్వరి. నవంబర్ 4న లండన్‌లో అవార్డుల కార్యక్రమాలకు చంద్రబాబు దంపతులు హాజరు కానున్నారు.

నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు-2025కి ఎంపికయ్యారు భువనేశ్వరి. ప్రజాసేవ, సామాజిక అంశాల్లో కీలకంగా పని చేసినందుకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందిస్తున్నట్టు ఐఓడీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్(IOD) సంస్థ ప్రకటించింది.

లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్‌లో జరిగే కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి అవార్డును అందుకోనుంది భువనేశ్వరి.

Also Read:రూమర్స్‌పై డీవీవీ దానయ్య!

- Advertisement -