రోహిత్ రికార్డు బ్రేక్ చేసిన బాబర్!

6
- Advertisement -

పాక్ సీనియర్ ఆటగాడు బాబర్ అజామ్ .. రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికాపై 2వ టీ20లో ఈ ఘనత సాధించాడు. లాహోర్‌లోని గద్దాఫీ స్టేడియంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. రోహిత్ శర్మ సొంతం చేసుకున్న ప్రపంచ రికార్డును అధిగమించడానికి ఆయనకు కేవలం 9 పరుగులు కావాల్సి ఉండగా సులభంగా సాధించాడు.

బాబర్ ఆజమ్ ఇప్పుడు టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ 4,231 పరుగులతో ఉన్న రికార్డును బాబర్ అధిగమించాడు. మాజీ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఇప్పటివరకు 122 ఇన్నింగ్స్‌లలో 4,232 పరుగులు సాధించాడు. బాబర్ సగటు దాదాపు 40 కాగా, స్ట్రైక్‌రేట్ 129.14. ఇందులో 3 శతకాలు, 36 అర్ధశతకాలు ఉన్నాయి.

ఇక రోహిత్ శర్మ 151 ఇన్నింగ్స్‌లలో 4,231 పరుగులు చేసి, సగటు 32.05, స్ట్రైక్‌రేట్ 140.89తో తన టీ20 కెరీర్‌ను ముగించాడు. ఆయన ఖాతాలో 5 శతకాలు, 32 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ 4188,జోస్ బట్లర్ 3869,పాల్ స్టిర్లింగ్ 3710 పరుగులు చేశారు.

Also Read:రూమర్స్‌పై డీవీవీ దానయ్య!

- Advertisement -