- Advertisement -
నాకు ఏ శాఖ ఇవ్వాలనేది సీఎం రేవంత్ నిర్ణయిస్తారు అన్నారు మంత్రి అజహరుద్దీన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు, నా మంత్రి పదవికి సంబంధం లేదు అన్నారు. ఏ శాఖ అప్పగించినా నిబద్ధతతో పని చేస్తానని తెలిపారు.
నన్ను కేబినెట్‌లోకి తీసుకోవడం హైకమాండ్, సీఎం నిర్ణయం అన్నారు. నాపై ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నారు.. నేనెంటో దేశ ప్రజలకు తెలుసు అన్నారు.
రాజ్ భవన్ లో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అజారుద్దీన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. అజారుద్దీన్ కి శుభాకాంక్షలు తెలియచేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎస్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తెలిపారు.
Also Read:డీప్ ఫేక్‌పై చట్టం తేవాలి:చిరు
- Advertisement -

