నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 ఈ ఏడాదిలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా సీక్వెల్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చారు మేకర్స్. ప్రముఖ సర్వేపల్లి సిస్టర్స్ ఈ చిత్రంలో భాగస్వామ్యం కానున్నారని ప్రకటించారు. పండిట్ శ్రవణ్ మిశ్రా మరియు పండిట్ అతుల్ మిశ్రా ఈ చిత్రంలోని సంస్కృత శ్లోకాల కోసం తమ స్వరాన్ని అందించనున్నారు.
ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో భారీ హైప్‌ను సృష్టించింది, ఇక అభిమానులు ఇప్పుడు మొదటి పాట విడుదలకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రంలో సమ్యుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రాన్ని రామ్ అచంట, గోపిచంద్ అచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read:బాల్ తాకి..యువ క్రికెటర్ మృతి

