మీ డబ్బులు మాకు వద్దు..విజయ్‌కు షాక్

7
- Advertisement -

మీ డబ్బులు మాకు వద్దు.. హీరో విజయ్ ఇచ్చిన రూ.20 లక్షలను తిప్పి పంపారు బాధితులు. తమిళనాడులోని కరూర్‌లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు టీవీకే అధ్యక్షుడు విజయ్ పంపిన పరిహారాన్ని తిప్పి పంపారు ఓ బాధితురాలు.

టీవీకే తరపున మృతుల కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో రూ.20 లక్షల చొప్పున ఈ నెల 18న జమచేశారు విజయ్.అయితే మృతుల్లో ఒకరైన రమేశ్ భార్య సంఘవి ఆ సొమ్మును తిప్పి పంపి.. విజయ్ నేరుగా వచ్చి మమ్మల్ని ఓదారుస్తారని వీడియో కాల్‌లో మాట్లాడారని, ముందుగా ఆర్థిక సాయం తీసుకోవాలని చెప్పారని తెలిపారు సంఘవి.

అయితే మాకు డబ్బు ముఖ్యం కాదని.. మేం విజయ్ పరామర్శ కోసం ఎదురుచూసాం…అందుకే తమ ఇష్టానికి భిన్నంగా తమ ఖాతాలో జమచేసిన రూ.20 లక్షల మొత్తాన్ని తిరిగి పంపామని తెలిపారు బాధితులు.

Also Read:TTD:30న పుష్పయాగం

- Advertisement -