మొంథా తుఫాను నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం, పత్తి, మొక్క జొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలని, రైతులకు నష్టం జరగకుండా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలన్నారు ముఖ్యమంత్రి.
సీఎం ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
మొంథా తుపాను ప్రభావం పై ఏపీ సచివాలయం నుంచి సమీక్ష నిర్వహించారు చంద్రబాబు.మొంథా తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్‌కు సీఎం సూచించారు. ప్రస్తుతం కాకినాడకు 680 కి.మీ దూరంలో ఉన్న మొంథా తుఫాన్16 కి.మీ వేగంతో తీరాన్ని సమీపిస్తోంది తుఫాన్. ప్రతీ గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని.. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
Also Read:యాక్షన్ సీన్స్‌లో #గోపీచంద్33

