ఐసీయూలో టీమిండియా స్టార్ క్రికెటర్!

6
- Advertisement -

భారత స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ఐసీయూలో చేరారు. ఆస్ట్రేలియాతో మూడవ వన్డే ఆడుతున్న సమయంలో క్యాచ్ పట్టే క్రమంలో తీవ్రంగా గాయపడ్డారు శ్రేయస్ అయ్యర్.

వైద్య పరీక్షల్లో రిబ్స్ లో రక్తస్రావం అయినట్లు గుర్తించారు. వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో శ్రేయస్ అయ్యర్ ఉండనున్నారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో అలెక్స్ కేరీని ఔట్ చేయడానికి బ్యాక్‌వర్డ్ పాయింట్ ప్రాంతం నుండి వెనక్కి పరుగెత్తి అద్భుతంగా క్యాచ్ పట్టిన సమయంలో అయ్యర్ తన ఎడమ పక్కెముకల వద్ద గాయపడ్డాడు. ఆయన డ్రెస్‌రూమ్‌కి తిరిగొచ్చిన కొద్దిసేపటికే పరిస్థితి విషమించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

శ్రేయస్ గత రెండు రోజులుగా ఐసీయూలో ఉన్నాడు. పరీక్షా ఫలితాల తర్వాత అంతర్గత రక్తస్రావం గుర్తించబడింది. అందువల్ల వెంటనే చేర్చాల్సి వచ్చింది అని ఈ పరిణామాలపై సమాచారం కలిగిన వనరు పీటీఐకి తెలిపారు. మొదట ఆయన మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారని అంచనా వేసినా, ఇప్పుడు ఆయన కోలుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also Read:విష్ణు విశాల్…’ఆర్యన్’

- Advertisement -