ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి పాలైంది. అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ విధించిన 265 పరుగుల టార్గెట్‌ను 46.2 ఓవర్లలో చేధించింది.
మాథ్యూ షార్ట్ (74), కూపర్ కొన్నోలీ (61 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా మిచెల్ ఓవెన్ (36), మాట్ రెన్షా (30) లు రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్‌లు తలా రెండు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్‌లు చెరో వికెట్ సాధించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61) హఫ్ సెంచరీలతో రాణించగా అక్షర్ పటేల్ (44), హర్షిత్ రాణా (24 నాటౌట్)గా నిలిచారు. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది ఆసీస్.

