రూ.100 కోట్లకు చేరువలో డ్యూడ్!

5
- Advertisement -

ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ చిత్రం తెలుగు, తమిళ మార్కెట్లలో పోటీని ఎదుర్కొంటున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించగా, మమితా బైజు హీరోయిన్‌గా నటించింది.

ఈ చిత్రం ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.95 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈరోజుతో రూ.100 కోట్ల మైలురాయిని దాటేందుకు సిద్ధంగా ఉంది. తన కెరీర్ ప్రారంభ దశలోనే వరుసగా రెండు ₹100 కోట్ల గ్రాస్ సినిమాలు ఇవ్వడం ద్వారా ప్రదీప్ రంగనాథన్ సంచలనాన్ని సృష్టించబోతున్నాడు.

ఈ చిత్రంలో సారత్‌కుమార్, హృదు హారూన్, రోహిణి, ఐశ్వర్య శర్మ ముఖ్య పాత్రల్లో నటించగా, సంగీతం సాయి అభ్యంకర్ అందించారు.

Also Read:పుతిన్‌తో చర్చలపై ట్రంప్

- Advertisement -