ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025లో వరుస ఓటములతో టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్ల్లో చేతుల వరకూ వచ్చిన విజయాలను చేజార్చుకుంది. తాజాగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
చివరి పది ఓవర్లలో భారత విజయానికి 62 పరుగులు కావల్సి ఉండగా చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. దీంతో భారత్ గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు అంతా. కానీ అనూహ్యంగా భారత్ ఓటమి పాలైంది. ఉండటంతో టీమిండియా విజయం ఖాయమని అందరూ అనుకున్నారు. పైగా స్మృతి మంధాన , రిచా ఘోష్ క్రీజులో ఉండటంతో విజయం న్లేరు మీద నడకే అనుకున్నారు.
28 బంతుల్లో భారత్ 34 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులో హాఫ్ సెంచరీతో దీప్తి శర్మ, 8 పరుగులతో రిచా ఘోష్ ఉంది. ఆడుతూ పాడుతూ గెలుస్తామని భారత్ ఫిక్స్ అయింది. అయితే వెంటవెంటనే వికెట్లు చేజార్చుకోవడంతో చివరికి 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేయగా.. భారత్ 6 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి ఓటమి పాలయింది. సెమీ ఫైనల్ రేసులో భారత్ – న్యూజిలాండ్ ఉండగా ఈ రెండు జట్ల మధ్య అక్టోబర్ 23న జరిగే మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తే వారే సెమీస్కు వెళ్లనున్నారు.
Also Read:దీపావళి హారతులు ఎందుకు ఇవ్వాలి?

