- Advertisement -
తెలంగాణ వ్యాప్తంగా 42 శాతం రిజర్వేషన్ల కోసం బంద్ జరుగుతోంది. బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. హైదరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, నల్గొండ ఖమ్మం, మహబూబాబాద్ పలు జిల్లాల్లో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఆర్టీసీ బస్సులు.
బస్సు డిపోల ముందు బైఠాయించారు బీసీ అఖిలపక్షం నాయకులు. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు వ్యాపారులు. ప్రయివేటు స్కూళ్లకు సెలవు ప్రకటించాయి యాజమాన్యాలు.
శాంతియుతంగా బంద్ చేసుకోవాలని డీజీపీ కోరారు. హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఉదయం నుంచే రోడ్డెక్కి వ్యాపార సంస్థలను బంద్ చేయిస్తున్న బీసీ సంఘాల నేతలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. పలు చోట్ల పోలీసులకు, బీసీ సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది.
Also Read:పోలింగ్ డే…సెలవు
- Advertisement -

