ఏపీ..2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీ

4
- Advertisement -

2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది అన్నారు మంత్రి నారా లోకేష్. అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అన్నారు.

క్లస్టర్ బేస్ అప్రోచ్ ద్వారా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది అన్నారు. గ్రేటర్ విశాఖని 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలన్నదే మా గోల్ అన్నారు. రాబోయే 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.88,000 కోట్ల పెట్టుబడులను గూగుల్ పెట్టనుంది. డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ వల్లనే ఇది సాధ్యమైంది అన్నారు లోకేష్.

మరోవైపు సాగర తీరానికి ఐటీ కంపెనీలు క్యూ కట్టాయి. రూ. 1.30.లక్షల కోట్లతో Google డేటా సెంటర్ ఏర్పాటు చేయగా రూ.1.35 లక్షల కోట్లతో ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ, క్యాప్టివ్ పోర్టుల అభివృద్ధి చేయనుంది. ఎన్టీపీసీ రూ.1.80 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేయనుంది.

రాంబిల్లిలో న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్, భోగాపురం విమానాశ్రయం, మూలపేట పోర్టు, జీఎంఆర్ యూనివర్సిటీ, ఫార్మా పార్కు, స్టార్ హోటల్స్, మాస్టర్న్ రోడ్లు, ఫ్లైఓవర్లు, కోస్టల్ కారిడార్, రైల్వే జోన్, మెట్రో.. ఇలా వైవిధ్యమైన ప్రాజెక్టులు వస్తున్నాయి.

Also Read:BRS:మాగంటి సునీత నామినేషన్

- Advertisement -