KTR:దొంగ ఓట్ల వ్యవహారంపై కోర్టుకు వెళ్తాం

6
- Advertisement -

దొంగ ఓట్ల వ్యవహారంపై రేపు కోర్టుకు వెళ్తాం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇంత స్పష్టంగా ఆధారాలతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం.. 24 గంటలు గడిచినా ఎన్నికల అధికారి నుండి ఉలుకు లేదు పలుకు లేదు, ప్రతిస్పందన లేదు… నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది అన్నారు. వెంటనే దీని మీద విచారణ చేపట్టి, ఈ దొంగ ఓట్లను తొలగించి, అధికారులను శిక్షించండి అని చెప్పాం.. అయినా వాళ్ళు స్పందించలేదు అన్నారు.

ఈ ఎన్నికల కమిషన్ పై నమ్మకం లేదు.. వాళ్ళు బీజేపీతో కలసి, ఎక్కడ కాంగ్రెస్ అధికారం ఉంటే అక్కడ వాళ్ళతో కలిసి పనిచేస్తారు అన్నారు. భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ నీతిమాలిన రాజకీయానికి నిదర్శనం ఇది… భర్త చనిపోయి 6 నెలలు కాలేదు, ఆమె బాధతో కన్నీళ్లు పెట్టుకుంటే అది కూడా రాజకీయం చేసే నీతిమాలిన నాయకులు కాంగ్రెస్ నాయకులు అన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి సొంత సోదరుడికే 3 దొంగ ఓట్లు ఉంటే ఇదేం ఎన్నిక…మేము న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము.. మాకు ఎన్నికల కమిషన్ మీద నమ్మకంలేదు ఎందుకంటే వాళ్ళు బీజేపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే సంస్థ..మరి ఇంక గత్యంతరం లేదంటే కోర్టుకు వెళ్లి అక్కడ పోరాటం చేస్తాము అన్నారు. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాము.. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ స్పందించాలి అన్నారు. ఎన్నికలు 10 రోజులు ఆలస్యమైనా సరే దొంగ ఓట్లు తొలగించి న్యాయంగా ఎన్నికలు జరిపించండి..దీనికి కారణమైన అధికారి మీద చర్యలు తీసుకోండి అన్నారు.

- Advertisement -