పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన చిత్రం ఓజీ. విడుదలైన తొలి రోజే రూ.150 కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఈ అక్టోబర్ 23 నుంచే ఓటిటిలో సందడి చేయనుందని టాక్ నడుస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.
బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించగా అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించగా ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య ₹250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
Also Read:రాజకీయ పార్టీల ప్రకటనలపై ఈసీ

