మిత్ర మండలి అనే న్యూ-ఏజ్ కామెడీ సినిమా అక్టోబర్ 16, 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. అలాగే బన్నీ వాస్ ఈ చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేస్తున్నారు.హైదరాబాద్లో జరిగిన ఒక ఈవెంట్ సందర్భంగా బన్నీ వాస్ మాట్లాడుతూ.. దీపావళి సందర్భంగా విడుదలవుతున్న మరో సినిమా తమపై లక్ష్యంగా పెట్టుకుని, పేడ్ నెగటివిటీకి దిగిందని ఆరోపించారు.
నా సినిమాపై ట్రోల్స్, నెగటివ్ ఫీడ్బ్యాక్ల రూపంలో ప్రణాళికాబద్ధమైన దాడి జరుగుతోందని నాకు తెలిసింది. ఆ టీంకి నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే — నాకు ఎవరినీ భయం లేదు, నా సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకునే వ్యక్తిని. కానీ ఇలాంటి చవకబారు పద్ధతులు అవలంబిస్తే, మీరు తడబడక తప్పదు అని హెచ్చరించారు.
అతను ఎవరినీ పేరు ప్రస్తావించకపోయినా, సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరో అనే చర్చలు ఊపందుకున్నాయి. ఎవరూ నా వెంట్రుక కూడా పీకలేరు … తొక్కితే బన్నీ వాసు పడిపోతాడు అనుకుంటున్నారేమో.. ఎవడి గురించో ఆలోచించి నేను ఇక్కడే ఆగిపోను .. పరిగెత్తుతూనే ఉంటాను అందులోనే నా విజయం ఉంటుంది … డబ్బులు కొంచెం ఎక్కువ తీసుకుని నన్ను ట్రోల్ చేయండి అని బన్నీ వాసు హెచ్చరించారు.
Also Read:నిధులన్ని ఖమ్మంకేనా?:కాంగ్రెస్ ఎమ్మెల్యే

