2024లో విజయ్ సేతుపతి మహారాజా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. దుల్కర్ సల్మాన్ లక్కీ బాస్కర్ 14 వారాల పాటు ఇండియన్ టాప్ 10లో కొనసాగింది. పుష్ప 2, అమరన్, లియో, దేవర వంటి దక్షిణాది సినిమాలు గ్లోబల్ టాప్ 10 నాన్-ఇంగ్లీష్ లిస్ట్‌లో చోటు దక్కించుకోవడంతో, ఈ ప్రాంతం నుండి వచ్చే ఒరిజినల్ కథలకు ఉన్న డిమాండ్ మరింత పెరిగింది.
TEST, The Game: You Never Play Alone విజయాల తర్వాత, నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఆరు కొత్త తమిళ, తెలుగు ఒరిజినల్ సినిమాలు, సిరీస్‌లతో కొత్త మైలు రాయిని చేరుతోంది.
నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మోనికా శెర్గిల్ మాట్లాడుతూ..“దక్షిణ భారత భాషలలోని కథలను ప్రోత్సహించడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. మా మొదటి ఒరిజినల్స్ నుండి ఈరోజు వరకూ, ఈ ప్రాంత కథల సమృద్ధి మా ఎదుగుదలకు బలమైంది. ఇప్పుడు, తమిళ, తెలుగు చిత్రసీమల నుండి వస్తున్న కొత్త క్రియేటర్స్ తో కలిసి థ్రిల్లర్లు, కామెడీలు, ఎమోషనల్ డ్రామాలు, క్రాస్-కల్చరల్ రొమాన్స్‌లతో కొత్త ఫేజ్ ను ప్రారంభిస్తున్నాము.
స్టీఫెన్(తమిళం)
దర్శకుడు మిథున్ తెరకెక్కించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో గోమతి శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఒక సైకియాట్రిస్ట్, తన ముందుకు వచ్చిన ఒక నేరస్థుడిని పరీక్షిస్తుంటుంది. అయితే ఆ కేసు వెనుక ఉన్న రహస్యం ఆమెనే మాయజాలంలోకి లాక్కుంటుంది.
సూపర్ సుబ్బు (తెలుగు)
దర్శకుడు మల్లిక్ రామ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ నటించిన ఈ కామెడీ సిరీస్ లాఫ్ రైడ్ గా వుతుంది. సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పమని ఒక గ్రామానికి పంపిన వ్యక్తి, ఆ విషయంలో పూర్తిగా అనర్హుడే అయినా ఎలా హిలేరియస్ పరిస్థితుల్లో పడతాడో చూపిస్తుంది.
Also Read:కోమటిరెడ్డి మరోసారి సంచలనం..
#Love (తమిళం)
దర్శకుడు బాలాజీ మోహన్ రూపొందించిన ఈ మోడరన్ రొమాంటిక్ సిరీస్‌లో అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించారు. కెమిస్ట్రీ vs కంపాటిబిలిటీ అనే చర్చను సరదాగా, హృదయాన్ని హత్తుకునేలా చూపించే ఈ సిరీస్ ప్రేమలోని మాధుర్యాన్ని, గందరగోళాన్ని ఒకేసారి పరిచయం చేస్తుంది.
మేడ్ ఇన్ కొరియా (తమిళం)
దర్శకుడు రా కార్తిక్ తీసిన ఈ క్రాస్ కల్చరల్ కథలో ప్రియాంక మోహన్, Squid Game ఫేమ్ పార్క్ హై-జిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కొరియా వెళ్లాలని కలగన్న యువతీ, కొత్త స్నేహాలు, జీవిత పాఠాల ద్వారా ఆమె తనను తాను తెలుసుకుంటుంది
తక్షకుడు (తెలుగు)
దర్శకుడు వినోద్ అనంతోజు తెరకెక్కించిన ఈ ఫోక్లోర్ థ్రిల్లర్‌లో ఆనంద్ దేవరకొండ ఒక అంధుడి పాత్రలో కనిపిస్తారు. తన గ్రామ ప్రజల మరణాలకు ప్రతీకారం తీర్చుకునే ప్రయాణంలో అతడికి అతని కుక్క తోడుగా ఉంటుంది.
లెగసీ (తమిళం)
దర్శకుడు చారుకేశ్ శేఖర్ రూపొందించిన ఈ ఫ్యామిలీ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ఆర్. మాధవన్, నిమిషా సజయన్, గౌతమ్ కార్తిక్, గుల్షన్ దేవయ్య, అభిషేక్ బెనర్జీ వంటి తారాగణం నటిస్తున్నారు. ఒక కుటుంబ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు నడిచే సక్సెషన్ యుద్ధం, నమ్మకాలు, ద్రోహాల మేళవింపుతో సాగుతుంది.
థ్రిల్లర్లు, ఎమోషనల్ డ్రామాలు, కామెడీలు, ప్రేమ కథలు .. డిఫరెంట్ జానర్స్ ద్వారా తమిళ, తెలుగు చిత్రసీమ క్రియేటివ్ ని ప్రపంచానికి చూపిస్తుంది నెట్‌ఫ్లిక్స్.
Black Warrant, Dhoom Dhaam, Dabba Cartel, Jewel Thief, TEST, The Royals, The Great Indian Kapil Show, The Ba*ds of Bollywood వంటి ప్రాజెక్టుల విజయాల తర్వాత, దక్షిణ భారత కథలు నెట్‌ఫ్లిక్స్ లో మరో కొత్త అధ్యాయాన్ని రాయబోతున్నాయి.
అద్భుతమైన ఈ కథలను నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్స్ పీరియన్స్ చేయండి.

