గిరిజన రైతుపై థర్డ్ డిగ్రీకి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది జాతీయ మానవ హక్కుల కమిషన్. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యూరియా కోసం ధర్నా చేసినందుకు గిరిజన రైతు సాయి సిద్దును విచక్షణారహితంగా కొట్టారు పోలీసులు.
సాయి సిద్దు భార్యను కులం పేరుతో దూషిస్తూ, అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు సామాజికవేత్త రేవంత్. దీంతో ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్ ను వెంటనే విధుల నుండి తొలగించాలని ఎస్పీకి మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఈ సంఘటనపై వెంటనే ఉన్నత స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్. నల్గొండ జిల్లాలో యూరియా కోసం ధర్నా చేసిన గిరిజనుడుపై పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. 25 నిమిషాలు విచక్షణారహితంగా కొట్టి, కుంటుకుంటూ నడిచినా, ఎవరికైనా చెప్పిన బెయిల్ రాకుండా చేస్తామని పోలీసులు బెదిరించారని కంటతడి పెట్టుకున్నాడు బాధితుడు.
Also Read:రివ్యూ: ఆరి

