సీఎం రేవంత్‌ను ప్రజలు నమ్మలేదు!

8
- Advertisement -

స్థానిక ఎన్నికలు ,జీవో నెంబర్ 9 పై నిన్న హై కోర్టు స్టే ఇచ్చింది అన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వినోద్ కుమార్…..తెలంగాణ ప్రజలు ఎవ్వరూ ఈ జీవో ను నమ్మలేదు…..రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో రిజర్వేషన్లు ఇచ్చినట్టు బీసీ లు నమ్మలేదు ..ప్రజలు ఈ జీవో పై ముందే తీర్పు నిచ్చారు…మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని రేవంత్ గతం లోనే చెప్పారు ..ఎన్నికలప్పుడు ఆయన మాటలు ప్రజలు నమ్మారు కానీ ఇపుడు నమ్మడం లేదు …దసరా పండగ అపుడే ప్రజలు ఎన్నికలు జరగవని నిర్ణయానికి వచ్చారు అన్నారు.

గత ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ ఓడి పోయింది 1 .6 శాతం ఓట్ల తేడాతోనే…నిన్న భట్టి విక్రమార్క బీ జే పి ,బీ ఆర్ ఎస్ లను విమర్శిస్తున్నారు ..బీజేపీ ని విమర్శిస్తే అర్ధం ఉంది .బీ ఆర్ ఎస్ ను విమర్శించడానికి లేదు ..గతం లోనే కేసీఆర్ బీసీ రిజర్వేషన్ల పై అసెంబ్లీ లో బిల్లు ఆమోదింపజేసి కేంద్రానికి పంపారు .కేంద్రం వద్ద అది ఇంకా పెండింగ్ లో ఉంది ..బీ ఆర్ ఎస్ చిత్తశుద్ధి ని శంకించడానికి లేదు …ఇందిరాగాంధీ పదవికి ముప్పు వచ్చినపుడు ఏకంగా రాజ్యాంగాన్నే సవరించారు ..ఓ వ్యక్తి కోసం కాంగ్రెస్ పార్టీ నాడు రాజ్యాంగాన్ని సవరించింది అన్నారు.

స్థానిక ఎన్నికల్లో బీసీ ల రిజర్వేషన్ల పెంపు కుదరదని కృష్ణమూర్తి కేసులో సుప్రీం తీర్పు వచ్చింది ..అపుడు అధికారం లో ఉన్న కాంగ్రెస్ ఆ తీర్పు కు వ్యతిరేకంగా రాజ్యాంగ సవరణ ఎందుకు చేయలేదు ?…ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగాన్ని సవరిస్తారు .బీసీ ల కోసం సవరించరా ?..రాహుల్ గాంధీ మోడీ ని పార్లమెంటు లో కౌగిలించుకుంటారు ..బీసీ రిజర్వేషన్ల కోసం రాహుల్ మోడీని ఎందుకు కౌగిలించుకోరు ?…రాహుల్ గానీ ఖర్గే గానీ తెలంగాణ లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంటు లో ఎందుకు మాట్లాడ లేదు …కాంగ్రెస్ వి మోసపూరిత మాటలే తప్ప చిత్తశుద్ధి లేదు …రాహుల్ మోడీ తలచుకుంటే బీసీ రిజర్వేషన్లు పెరగవా ?…ఈ దేశం రాజ్యాంగం మీద నడుస్తుంది తప్ప మరెవరి ఇష్టాయిష్టాల మీద కాదు…వోడాఫోన్ 40 వేల కోట్ల రూపాయల మేర ఇన్కమ్ టాక్స్ కట్టాలని సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం చట్టం ద్వారా దాన్ని తిరస్కరించింది …వోడాఫోన్ కు లబ్ది చేకూర్చిన బీజేపీ బీసీ ల రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యాంగాన్ని ఎందుకు సవరించదు ? చెప్పాలన్నారు.

..ఎన్నో సార్లు తమకు అనుకూలంగా ఉన్న విషయాలపై రాజ్యాంగాన్ని సవరించిన బీజేపీ బీసీ ల కోసం ఎందుకు సవరించదు ?…బీసీ కుల గణన పై కూడా సుప్రీం తీర్పు ను దాటవేసేలా పార్లమెంటులో బీజేపీ చట్ట సవరణ తెచ్చింది …బీ ఆర్ ఎస్ హై కోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదని పొన్నం ప్రభాకర్ అంటున్నారు ..బీ ఆర్ ఎస్ డ్రామా కంపెనీ కాదు బీసీ లతో రాజకీయాలు చేయడానికి …రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్ల పెంపు పై పార్లమెంటు లో కనీసం ప్రైవేట్ మెంబెర్ బిల్లునైనా పెట్టారా ?..తొమ్మిదో షెడ్యూల్ లో చేరిస్తే తప్ప బీసీ లకు రిజర్వేషన్లు పెరగవు …ఇప్పటికైనా ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ లు కలిసి తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చడం కోసం ప్రయత్నాలు చేయాలి .బీ ఆర్ ఎస్ సహకరిస్తుంది …డ్రామాలు ఇప్పటికైనా కట్టిపెట్టండి .బీసీ లను మోసం చేయాలనే వైఖరిని కాంగ్రెస్ విడనాడాలి ..రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారు .మోడీ పై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్లు పెంచేలా వారు ఎందుకు కృషి చేయడం లేదు ?…తమిళనాడు లో బీసీ లకు విద్యా ఉద్యోగాల్లో 69 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి తప్ప స్థానిక సంస్థల్లో 50 శాతం మించి లేవు అన్నారు.

Also Read:సీఎం రేవంత్‌ను ప్రజలు నమ్మలేదు!

- Advertisement -