బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 31 రోజులు పూర్తి చేసుకుంది. తాజాగా ఎపిసోడ్లో భాగంగా తొలుత తనూజ గార్డెన్ ఏరియాలో వాకింగ్ చేస్తుంటే ఇమ్మూ పక్కకి వెళ్లి సరదాగా ఆటపట్టించాడు. కాసేపటికి తనూజకి కళ్యాణ్ ప్రపోజల్ పెట్టాడు. ఏదైనా అవకాశం ఉండి.. నా లాంటి వాడు అయితే నీకు ఓకేనా .. అని కళ్యాణ్ అడిగితే ఇందుకే నిన్ను చైల్డ్ అనేది.. అంటూ తనూజ నవ్వుకుంది.
కాసేపటికి బిగ్‌బాస్ ఓ టాస్క్ పెట్టాడు. నిన్న నేను ఇచ్చిన టాస్కులో మీరు ప్రదర్శించిన ఆట తీరు చూసి ఆటలో మీ స్ఫూర్తి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమైంది.. కానీ తప్పులని సరిదిద్దుకోవడానికి మరో అవకాశం ఇస్తున్నాను.. ఇందుకోసం నేను మీకు ఇస్తున్న టాస్క్ మ్యాచ్ ఇట్ విన్ ఇట్.. ఈ టాస్కులో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా ప్రతి జంటలో ఒకరు యాక్టివిటీ ఏరియాలో ఉన్న మ్యూజియంకి వెళ్లి అక్కడ రెడ్ క్లాత్ ఉన్న స్టూల్‌పై పెట్టిన వస్తువుని గమనించి లివింగ్ ఏరియాకి వచ్చి తాము చూసిన వస్తువును డ్రాయింగ్ బోర్డ్ మీద గీయాలి.. జంటలోని మరో సభ్యుడు తమ పార్టనర్ వేసిన బొమ్మ చూసి యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లి ఆ వస్తువును అంచనా వేసి దాన్ని తీసుకొని రావాలి అని చెప్పారు. తొలి రౌండ్లోనే భరణి-దివ్య గెలిచేశారు.
తర్వాతి రౌండ్లో ఫ్లోరా-సంజన గెలిచి సెకండ్ ప్లేస్ సాధించారు. ఆ నెక్స్ట్ శ్రీజ-సుమన్, తర్వాతి రౌండ్లో రీతూ-డీమాన్ గెలిచారు. ఇక చివరికి ఏం గెలవకుండా ఒక్క పాయింట్ కూడ పొందకుండా మిగిలిపోయింది తనూజ-కళ్యాణ్ జంట. నిజానికి అందరికంటే తనూజనే బాగా బొమ్మలు గీసింది. కానీ వాటిని చూసి లోపలికెళ్లి వస్తువు తీసుకురాలేకపోయాడు కళ్యాణ్. రెండో టాస్క్ కూడా వెంటనే పెట్టాడు బిగ్‌బాస్. డేంజర్ జోన్లో ఉన్న సభ్యులకి నేను ఇస్తున్న మరో టాస్క్ ‘హోల్డ్ ఇట్ లాంగ్’.ఈ టాస్కులో గెలవడానికి అన్ని జంటలు చేయాల్సింది ఏంటంటే స్టార్ట్ బజర్ మోగగానే ప్రతి జంటలోని ఇద్దరు పోటీదారులు తమకి కేటాయించిన ప్లాట్‌ఫామ్‌కి రెండువైపులా నిలబడి ఆ ప్లాట్‌ఫామ్ తాళ్లకి ఉన్న హ్యాండిల్స్‌తో ప్లాట్‌ఫామ్‌ను గాల్లో ఉంచి పట్టుకోవాలి.. ఏ జంట అయితే టాస్క్ ముగిసేవరకూ తమ ప్లాట్‌ఫామ్‌ను నేలకి టచ్ కాకుండా గాల్లో ఉంచగలుగుతారో వారు ఈ టాస్క్ విజేతలు అవుతారు. ఈ టాస్కులో ముందుగా సుమన్-శ్రీజ ఔట్ అయిపోయరు.
ఈ రెండు టాస్కులు ముగిసేసరికి లీడర్ బోర్డ్‌లో రీతూ-డీమాన్ జోడీ 190 పాయింట్లతో ఫస్ట్‌కి వచ్చేసింది. ఆ తర్వాత ఫ్లోరా-సంజన, భరణి- దివ్య చెరో 180 పయింట్లతో రెండో స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత 110 పాయింట్లతో కళ్యాణ్-తనూజ, 90 పాయింట్లతో శ్రీజ-సుమన్ చివరి స్థానాల్లో మిగిలిపోయారు.
Also Read:హరీష్ రావు..హౌస్ అరెస్ట్

