బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. రేపు మధ్యాహ్నం 2:15 గంటలకు విచారణ వాయిదా వేసింది హైకోర్టు. యధావిధిగా నోటిఫికేషన్ విడుదలకానుంది.
బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ఆర్ కృష్ణయ్య, వీ హనుమంతరావుతో పాటు పలువురు బీసీ నేతలు ఇంప్లీడ్ పిటిషన్స్ వేశారు. ఆయా పిటిషన్లను సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. విద్య, ఉద్యోగాల్లో 50శాతం దాటినా రాజకీయ రిజర్వేషన్లు పెంచరాదని.. ఏజెన్సీల్లో ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ల సీలింగ్ వర్తించదని వాదించారు.
42శాతం రిజర్వేషన్లకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు చూపించలేదని.. బీసీ కుల గణన చేసినా ఇంకా బహిర్గతం చేయలేదన్నారు. ఈ కుల గణన ఆధారంగానే 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెబుతున్నారని.. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు మాత్రం 2011 జనాభా ఆధారమని చెబుతున్నారన్నారు.
ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు విచారణను గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. రేపు స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ రానుండగా.. నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడాలని పిటిషనర్లు కోరగా హైకోర్టు పట్టించుకోలేదు.
Also Read:KTR:రైతుల ఆత్మహత్య బాధాకరం

