కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవలి కాలంలో నిత్యం వివాదాల్లో చిక్కుకుని వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా సిద్దరామయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటకలో పెను రాజకీయ దుమారాన్నే రేపుతున్నాయి. బెళగావి జిల్లాలో ఓ ర్యాలీలో పాల్గొన్న సిద్దరామయ్య ప్రజలను ఉద్దేశించి బ్లూ ఫిల్మ్ ఎప్పుడైనా చూశారా అంటూ ప్రశ్నించారు.
దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. అయితే తాను ఈ ప్రశ్న అడగడానికి కూడా ఓ కారణం ఉందంటున్నారు సిద్దరామయ్య. బీజేపీ నేతల్లో కొందరిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చారు.

”మీ భాజపా ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఎందుకు పోగొట్టుకున్నారో? మీరు అడగండి. అసలు బ్లూ ఫిల్మ్ అంటే ఏంటో మీకు తెలుసా? ఒక్కసారైనా చూశారా? అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయం లోపల మీ ఎమ్మెల్యే బ్లూ ఫిల్మ్ చూస్తూ దొరికిపోయాడు. అలాంటి ఎమ్మెల్యేని అధికారంలో ఉంచకూడదని, వెంటనే పదవి నుంచి తొలగించాలని అన్నారు. ఇలాంటి వ్యక్తులు జనజీవనంలో ఇంకా ఎందుకు కొనసాగుతున్నారో అర్థం కావడం లేదని సిద్ద రామయ్య విమర్శించారు.
అంతేకాదు ఇలాంటి సిగ్గులేని వ్యక్తి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకోవాలి” అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దారామయ్య బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇప్పటికే ఆయన చర్యలతో, వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న సిద్ధరామయ్యకు ఖరీదైన వాచ్, కుమారుడి కోసం లాబీయింగ్‌లు, ఏసీబీ ఏర్పాటు, కాకి వాలిందని కారు మార్చడం ఇలా ఏది చేసినా తలనొప్పిగా మారుతోంది.

గతేడాది బెంగళూరలో జరిగిన కురుబ కమ్యూనిటీ సన్మాన కార్యక్రమంలోనూ అందరి ముందు ముఖ్యమంత్రికి ఓ మహిళ ముద్దు పెట్టంది. చిక్‌మగ్‌ళూర్ జిల్లా తరికేరే ప్రాంతానికి చెందిన పంచాయతీ సభ్యురాలు గిరిజా శ్రీనివాస్‌ను సీఎం సిద్దరామయ్య ఆ సభలో సన్మానించారు.
అంతే ఆమె సభావేదికపైనే అందరూ చూస్తుండగానే సీఎం బుగ్గ మీద ముద్దు పెట్టేసింది. ఇది అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. తాజాగా బ్లూ ఫిల్మ్ వ్యాఖ్యలు కూడా కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

