దేశవాళీ క్రికెట్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రంజీ ట్రోఫీ వార్మప్ మ్యాచ్‌లో మహారాష్ట్ర బ్యాటర్ పృథ్వీ షా, ముంబై యువ ఆటగాడు ముషీర్ ఖాన్‌తో గొడవకు దిగాడు. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అంపైర్, తోటి ఆటగాళ్లు మధ్యలోకి వచ్చి పృథ్వీని పెవిలియన్‌కు పంపించడంతో వివాదం సద్దుమణిగింది.
మహారాష్ట్ర – ముంబై వార్మప్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 181 పరుగులతో మెరిశాడు పృథ్వి షా. షా అవుటైన తర్వాత ముంబై యువ ఆటగాడు ముషీర్ ఖాన్ అతనికి సెండ్ ఆఫ్ ఇస్తూ ఏదో వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి లోనైన షా బ్యాట్‌ను అతని వైపు ఊపి, కాలర్ పట్టుకోవడంతో మైదానంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఆగస్టులో బుచ్చిబాబు టోర్నమెంట్లో మహారాష్ట్ర తరఫున ఆడి శతకం సాధించాడు. తదుపరి మ్యాచ్‌లో అర్ధశతకం సాధించి, ఇప్పుడు మళ్లీ 181 పరుగుల ఇన్నింగ్స్‌తో రాణించాడు. అక్టోబర్ 15 నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ ముందు షా ఇలాగే ఫార్మ్‌లో కొనసాగాలనుకుంటున్నాడు.
Also Read:భూమనపై భాను ప్రకాష్ రెడ్డి మండిపాటు

