ఫ్రీ బస్ అంటేనే టోకరా:తలసాని

8
- Advertisement -

పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలు ప్రభుత్వం వెంటనే వెనుకకు తీసుకోవాలని మేము ఆందోళన చేపట్టడం జరుగుతుంది అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రయాణికులు,ప్రజల అందరినీ కలుపుకొని ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది…ఫ్రీ బస్ అంటూనే మహిళల కుటుంబ సభ్యులకు బస్ ఛార్జీల పెంపు చేశారు అన్నారు.

గతంలో ఎన్నడు కూడా లేదు 10 రూపాయల పెంపు అనేది…పేద ప్రజలు బస్ బస్ ఛార్జీల భారం అవుతుంది….చాలా మంది ప్రజలు డబ్బులు ఎక్కువగా పెట్టీ ఆటో లలో,కార్లలో పోలేరు …అలాంటి వారికి ఇది భారం అవుతుంది….చాలా దేశాలలో బస్ ఉచితంగానే ఉంటుంది.అలాంటిది మన రాష్ట్రం లో మహిళలకు ఉచిత బస్ అని వారి కుటుంబ సభ్యులకు డబుల్ ఛార్జీ చేయడం భారం అవుతుంది అన్నారు.

రాష్ట్రంలో మని సర్కులేషన్ లేదు,రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలు అయింది…రెగ్యులర్ ఆర్టీసీ వాళ్లని తీసేసి ఔట్ సోర్సింగ్ వాళ్లను పెట్టారు ఆర్టీసీ లో…భద్రత విషయంలో ఆర్టీసీ దేశంలోనే మంచి పేరు ఉన్నది ..యాక్సిడెంట్స్ లను చూస్తే ఆర్టీసీ లో చాలా తక్కువగా ఉంటుంది….కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసున్నాం గవర్నర్ కు పంపడం జరిగింది అన్నారు. అదే సమయంలో ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వారిని రెగ్యులర్ చేస్తామని,వారిని ప్రభుత్వం లో విలీనం చేస్తాం అని చెప్పారు,పీఆర్సీ కూడా ఇస్తాం అన్నారు.

కానీ ఇవాళ ఇప్పటికే గౌలిగూడ బస్ స్టాండ్ ను ప్రైవేట్ కు ఇచ్చారు,ఇతర బస్టాండ్ లను,ప్రైవేట్ కు ఇచ్చేందుకు ప్రయత్నం నడుస్తోంది..ఆర్టీసీ ఉద్యోగులు అందరూ కూడా మేల్కొవాలి.లేదంటే సంస్థ అంత ప్రైవేట్ వ్యక్తుల చేతులలోకి వెళ్తుంది…అయితే మేము ఆర్టీసీ సంస్థ ను కాపాడడం కోసం బిఆర్ఎస్ పార్టీ వినూత్న కార్యక్రమాలు స్వీకారం చుట్టడం జరుగుతుంది.ఎల్లుండి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి,పద్మారావు,ముఠా గోపాల్ వారి రూట్లలో బస్ లో ప్రయాణించి బస్ భవన్ కు చేరుకొని ఆర్టీసీ ఎండీ కి వినతి పత్రం ఇస్తాం.ఎలెక్ట్రిక్ బస్ లను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం కాదు ఎలెక్ట్రిక్ బస్ లకు ఆర్టీసీ ఉద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి వారితోనే నడపాలి.ఇప్పటికే చాలా చోట్ల ఆర్టీసీ డిపో లు,ఖాళీ స్థలాలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది.

గౌలిగూడ బస్ స్టాండ్ ను 400కోట్లకు ప్రైవేట్ కు ఇవ్వడం,కొండాపూర్, రాణి గంజి డిపో లను కూడా ఇవ్వడం ఎందుకు ఆర్టీసీని ప్రైవేట్ చేసే కుట్రలు జరుగుతున్నాయి.ఇచ్చిన మాట ఏది అమలు కాలేదు,మహిళలకు ఉచితం అన్నారు,అదే వారి కుటుంబ సభ్యులకు మాత్రం భారం మోపుతున్నారు.ప్రజలు మీకు బుద్ధి చెప్తారు,ప్రజలు అమాయకులు కారు ఎల్లుండి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు ఉంటాయి అన్నారు.

- Advertisement -