జాన్వీ కపూర్..మరో ఫ్లాప్!

7
- Advertisement -

జాన్వీ కపూర్‌ మరో ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. ఆమె నటించిన తాజా చిత్రం “సన్నీ సంస్కారి కీ తులసి కుమారి” బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

భారీ హైప్‌ మరియు ప్రమోషన్స్ చేసినప్పటికి ఈ చిత్రం మిశ్రమ–ప్రతికూల సమీక్షలను అందుకుంది. ఇప్పటివరకు కేవలం రూ. 30 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామాను ధర్మా ప్రొడక్షన్స్ నిర్మించగా, ఇందులో జాన్వీకి జోడీగా వరుణ్ ధావన్ నటించారు. వాణిజ్యపరంగా పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్న జాన్వీకి ఇది మరో నిరాశాజనక ఫలితంగా మారింది. అయితే త్వరలో రామ్ చరణ్ సరసన “పెద్ది” చిత్రంలో కనిపించనుండగా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది.

Also Read:పొన్నం క్షమాపణ చెప్పాల్సిందే!

- Advertisement -