TGSRTC:గ్రీన్ ఫీజు పేరుతో జేబుకు చిల్లు

9
- Advertisement -

మరోసారి సిటీలో ఛార్జీలు పెంచి ప్రజల జేబుకు చిల్లు పెడుతోంది టీజీఎస్ఆర్టీసీ. సోమవారం నుండి హైదరాబాద్‌లో అన్ని సిటీ బస్సు టిక్కెట్లపై ‘గ్రీన్ ఫీజు’ వసూలు చేస్తోంది టీజీఎస్ఆర్టీసీ.

టికెట్‌కు రూ.5 నుండి రూ.10 వరకు పెంచగా గ్రీన్ ఫీజు ద్వారా సంవత్సరానికి దాదాపు రూ. 110 కోట్లు ఆదాయం సమకూరనుంది. హైదరాబాద్‌లో డీజిల్ నుండి ఎలక్ట్రిక్ బస్సులకు మారడానికి నిధులు సమకూర్చడానికి అదనపు ఛార్జీలు అవసరమని పేర్కొన్నారు అధికారులు.

ఆ డబ్బులను నగరం అంతటా ఎలక్ట్రిక్ బస్ డిపోలు మరియు ఛార్జింగ్ పాయింట్ల సదుపాయాలను నిర్మించడానికి ఉపయోగించబడుతుందని తెలిపారు టీజీఎస్ఆర్టీసీ అధికారులు.

Also Read:పొన్నం క్షమాపణ చెప్పాల్సిందే!

- Advertisement -